వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో హనుమాన్ మాల దారుల సంకీర్తణలతో నగరం మారుమోగింది. సుమారు 200 మంది హనుమాన్ మాల ధరించిన స్వాములు పట్టణంలోని శివాంజనేయ దేవాలయంలో ఉదయన్నే పూజలు చేసి వీధుల్లో నగర సంకీర్తణ చేశారు.. ఈ కార్యక్రమానికి హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. హనుమాన్ మాల ధరించిన భక్తులు 41 రోజుల పాటు కఠినమైన నియమ నిబంధనలతో ఉపవాస దీక్ష చేస్తారు. ఎప్రిల్ 19న మాల ధరించిన స్వాములు మే 29 వరకు దీక్ష చేసి భద్రాచలం, కొండగట్టు లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లి మాల విరమణ చేస్తారు.
ఇవీ చూడండి: ర్త చనిపోయిన 15ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చింది..