Frans women wardhannapet man : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి శివారు గుంటూరుపల్లికి చెందిన జితేందర్ రెడ్డి 12 ఏళ్ల క్రితం ఉద్యోగ రీత్యా ఐర్లాండ్ వెళ్లాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న జితేందర్.. అక్కడే పనిచేస్తున్న ఫ్రాన్స్ దేశానికి చెందిన ఇనేస్ సొన్ సులోట్తో పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమగా మారింది.
వారి ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పి వారి అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు. వీరి వివాహం హిందూ సంప్రదాయ పద్ధతిలో వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు వధువు తరఫున ముగ్గురు స్నేహితులు హాజరయ్యారని.. వరుడు తండ్రి చిన్నపురెడ్డి తెలిపారు. ఖండాంతరాలు దాటి ఏకమైన జంటను చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో వచ్చి నవవధూవరులను ఆశీర్వదించారు.
ఇదీ చూడండి : వివాహ బంధంతో ఒక్కటైన హనుమకొండ అబ్బాయి... అమెరికా అమ్మాయి