ETV Bharat / state

గూడ్స్ రైలులో చెలరేగిన మంటలు

వరంగల్​ గ్రామీణ జిల్లాలోని నెక్కొండ దగ్గర గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి.  సకాలంలో రైల్వే సిబ్బంది స్పందించటం వల్ల మంటలు అదుపులోకి వచ్చాయి. విశాఖ నుంచి మహారాష్ట్రకు బొగ్గు లోడ్​తో గూడ్స్‌ రైలు వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది.

గూడ్స్ రైలులో చెలరేగిన మంటలు
author img

By

Published : Jun 29, 2019, 11:36 PM IST

విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకి బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్​కు చేరుకునేసరికి దాదాపుగా 10 బోగిలలో మంటలు అంటుకున్నాయి. మూడు బోగిలలో పూర్తిగా బొగ్గు అంటుకొని మంటలు ఎగిసిపడటం వల్ల అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కేసముద్రం, మహబూబాబాద్‌, గుండ్రాతిమడుగు, డోర్నకల్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

గూడ్స్ రైలులో చెలరేగిన మంటలు

ఇవీచూడండి: 15-20 శాతం పెరగనున్న ఇంజినీరింగ్ ఫీజులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.