వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండలోని దుర్గా కాటన్ మిల్లులో కరెంట్ షాక్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది మంటలను ఆర్పడం వల్ల భారీ ఆస్తి నష్టం తప్పింది.
ప్రమాదంలో ఐదు బేళ్ల పత్తి కాలిపోయినట్లు కాటన్ మిల్లు యజమాని తెలిపారు. కాలిన పత్తి విలువ సుమారు 20 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. గతంలో సైతం ఓ సారి అగ్ని ప్రమాదం జరిగి 70 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సిబ్బంది పేర్కొన్నారు.
ఇదీ చూడండి : మత కల్లోలాలు సృష్టించేందుకు భాజపా కుట్ర: ఇంద్రకరణ్ రెడ్డి