వరంగల్ రూరల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన బలభద్ర సదయ్య అనారోగ్య కారణాలతో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక ముఖ్యమంత్రి సహాయనిధి సాయాన్ని కోరాడు. అతని వైద్యం కోసం మూడు లక్షల రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్వయంగా హనుమకొండలోని బాధితుడి ఇంటికి వెళ్లి చెక్కును అందించారు.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వరంలా మారిందన్నారు చల్లా. ఎంతో మంది నిరుపేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి, రిలీఫ్ ఫండ్ –ఎల్వోసీల ద్వారా ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేని వారు ముఖ్యమంత్రి సహాయనిధి సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సాయాన్ని అందించినందుకు ఎమ్మెల్యేకి బాధిత కుటుంబం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: పట్టణ ప్రకృతి వనానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు