వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారని ఆరోపిస్తూ.. ధాన్యానికి నిప్పంటించి రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం తూకంలో రైతులను మోసం చేస్తూ కొనుగోళ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టోకెన్ ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా.. తమ ధాన్యం ఇంకా కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూడాలని అన్నదాతలు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: 'అదే జరిగితే... దక్షిణ తెలంగాణ ఎడారైపోతుంది'