తమ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. రైతులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం వేపచెట్టు తండాలో చోటు చేసుకుంది.
గ్రామంలోని చాలా మంది రైతులకు భూములకు పట్టాలు ఇవ్వలేదని ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగిన తమ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని రైతులు 365 జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తక్షణమే ఆర్టీవో వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి రైతులను శాంతింపచేసి రాస్తారోకో విరమింపజేశారు.
- ఇదీ చదవండి: తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ