ETV Bharat / state

Corona medicines: కరోనా రోగికి కాలం చెల్లిన మందులు - expiry medicines to corona patients in illanda village

కరోనా రోగుల పట్ల ఆరోగ్య సిబ్బంది చూపిస్తున్న నిర్లక్ష్యం బాధితుల పాలిట శాపంగా మారుతోంది. కొవిడ్​ను జయించాలంటే మందుల వినియోగం తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతుంటే ఆచరణ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. కాలం చెల్లిన మందులను రోగులకు అందిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కొందరు ఆరోగ్య కార్యకర్తలు. ఇదేంటని ప్రశ్నిస్తే పొరపాటున ఇచ్చామని తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. కరోనా బాధితురాలికి కాలం చెల్లిన మందులను అందజేసిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో గురువారం చోటు చేసుకుంది.

expiry medicines to corona patients
కరోనా రోగికి కాలం చెల్లిన మందులు
author img

By

Published : May 28, 2021, 12:54 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలోని కరోనా బాధితురాలికి ఆరోగ్య కార్యకర్త కాలం చెల్లిన మందులను అందజేసింది. గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళ ఇటీవల కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్​లో ఉంటోంది. విషయం తెలుసుకున్న ఆరోగ్య సిబ్బంది ఆమెకు.. బుధవారం విటమిన్ సీ, డీ మందులు అందజేశారు. వాటిలో కాలం చెల్లిన మందులు ఉండటంతో బాధితురాలు అవాక్కయింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వాట్సాప్ గ్రూపుల్లో వాటిని పోస్ట్ చేశారు. ఈ ఘటన మండల వైద్యాధికారి వెంకటేశం దృష్టికి వెళ్లింది.

సంబంధిత ఆరోగ్య సిబ్బందితో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు వెంకటేశం తెలిపారు. ఆరోగ్య కార్యకర్త వ్యక్తిగతంగా ఆమె వద్ద ఉన్న మందులను పొరపాటున బాధితురాలికి అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు అధికారి తెలిపారు.

ఇదీ చదవండి: Super Spreaders: నేటి నుంచి సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.