వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో కరోనా పరీక్షల నిర్ధరణ కేంద్రం ఏర్పాటైంది. కోటి డెబ్భై లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వైరాలజీ ల్యాబ్‌ను మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మంకు సంబంధించి కరోనా కేసుల పరీక్షలను ఇక్కడ నిర్వహిస్తారు. రోజూ వంద మందికి పరీక్షలు చేసేందుకు అవకాశం ఉందన్నారు.
లాక్డౌన్ సమయంలో పేదలేవరూ పస్తులుండకూడదని భావించి ముఖ్యమంత్రి అనేక సదుపాయాలు కల్పిస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. కరోనాతోపాటు ఇతర రకాల వైరస్‌లను కూడా ఇక్కడ నిర్ధరించే వీలుంది.
ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోకుండా కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్విరామంగా పని చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్, కేంద్రానికి మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి : శ్రీమంతానికి వెళ్తుండగా ప్రమాదం.. గర్భిణీ మృతి