వరంగల్ కాకతీయ జూ పార్కులో పాముల ప్రదర్శన ఆకట్టుకుంది. వనదర్శిని పేరుతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జంతువులు, మొక్కలపై జిల్లా అటవీశాఖ అవగాహన కల్పిస్తోంది. ఫ్రెండ్స్ ఆఫ్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో చిన్నారులకు పాములపై ఉన్న అపోహలను తొలగించారు.
విషం ఉన్న, లేని సర్పాలను ప్రదర్శించి చిన్నారుల్లో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు. కట్ల పాము, జెర్రిపోతు, నాగు పాము, కొండ చిలువ, రక్త పింజర, ఆకుపచ్చ పాములను ప్రదర్శించారు.
పాము కాటు వేసినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలను విద్యార్థులకు వివరించారు.