ప్లాస్టిక్ విచ్చలవిడి వినియోగంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోంది. దీంతో కాలుష్య నియంత్రణకు తనవంతు ప్రయత్నంగా ముప్పారపు రాజు చొప్పబెండు పెన్నుల తయారీకి పూనుకొన్నారు. ఈయనది వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం గోపాలపురం. మొక్కజొన్న చొప్పలను సేకరించి వాటిలో రీఫిల్‌లను అమర్చుతూ ఈ పెన్నులకు రూపమిస్తున్నారు. వరంగల్ నగరపాలిక కమిషనర్ పమేలా సత్పతి.. ఈ పెన్నులు బాగున్నాయంటూ ట్విటర్ వేదికగా కితాబిచ్చారు. ప్లాస్టిక్ పెన్నులకు బదులు వీటిని వినియోగిస్తే పర్యావరణానికి కొంతైనా మేలుచేసిన వారమవుతామంటారు రాజు.
ఇదీ చదవండి: ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...!