ETV Bharat / state

ఈ శివుడి చేతిలో... ప్రాణం పోసుకున్న గణనాథులెందరో!

బీటెక్ చదవాడు. గణేష్ విగ్రహాల తయారీని ఉపాధిగా ఎంచుకున్నాడు. పదిమందికి పని కల్పిస్తూ...పర్యావరణ హితంగా మట్టి గణపతుల తయారీని చేపట్టాడు. ఇప్పటికి వేల విగ్రహాలు తయారు చేశాడు. ఆ యువకుని చేతిలో తయారైన గణనాథుని ప్రతిమలు చూస్తే.... ఎవ్వరైనా వాహ్వ అనాల్సిందే...

ఆ శివుడి చేతిలో... ప్రాణం పోసుకున్న గణనాథులెందరో!
author img

By

Published : Sep 1, 2019, 8:20 PM IST

Updated : Sep 2, 2019, 7:28 AM IST

ఆ శివుడి చేతిలో... ప్రాణం పోసుకున్న గణనాథులెందరో!

వరంగల్​కు చెందిన శివకుమార్ వినాయకచవితి వస్తోందంటే చాలు బిజీ అయిపోతాడు. అలా అని గణేష్ చందాలు అడగడానికో... మండపాలు తయారు చేయడానికో అనుకోకండి. మట్టి గణపతులను తయారు చేయడానికి. అతనితోపాటు మరో పది మందికి ఉపాధినివ్వడానికి. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించి... మట్టి వినాయక విగ్రహాల తయారీని చేపట్టాడు శివకుమార్. మొదట్లో అంత ఆదాయం రాకపోవడం వల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారు చేయమని చాలా మంది సలహాలిచ్చారు. అయినప్పటికీ శివకు ప్రకృతి మీద ఉన్న ప్రేమతో... మట్టి వినాయకులనే తయారు చేశాడు. దాదాపు 40 మందికి ఉపాధి కల్పిస్తూ... ఎకో ఫ్రెండ్లీ శివగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అందంగా అలంకరణ

కొనుగోలుదారులను ఆకర్షించేలా మట్టి వినాయక విగ్రహాలను అందంగా తయారు చేయడం శివ ప్రత్యేకత. దుస్తులు, ఇతర చిన్న పాటి అలంకరణలతో... వినాయక విగ్రహాలను సుందరంగా తయారు చేస్తాడు. ఈ విగ్రహాలను ఒక్కసారి చూస్తే చాలు... ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కూడా మరిచిపోతారు. మట్టి ప్రతిమల తయారీపై ప్రజల్లో అవగాహన బాగా పెరిగిందని, ఎక్కువమంది ఇప్పుడు వీటినే కావాలంటున్నారని శివ చెబుతున్నాడు. అయితే డిమాండ్​కు తగ్గట్టుగా ఉత్పత్తి లేదని, ప్రభుత్వం చొరవ తీసుకొని మట్టి విగ్రహాలను తయారు చేయించాలని కోరుతున్నాడు. రసాయనాలతో తయారు చేసిన ప్రతిమలతో జలవనరులను కలుషితం చేయకుండా చూడాల్సిన బాధ్యత యువతపైనే ఉందని శివ అభిప్రాయ పడుతున్నాడు.

హైదరాబాద్​లోనూ మార్కెట్

ప్రస్తుతం వరంగల్​తోపాటు... హైదరాబాద్ లోనూ మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి కొనుగోలుదార్లకు సరఫరా చేస్తున్నాడు శివ. సేవ్ వాటర్ సేవ్ యర్త్ అంటూ వచ్చిన వారికి చెప్పడమే కాదు.. దుకాణం ముందు ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసి పర్యావరణ మిత్రగా పేరొందాడు ఈ ఓరుగల్లు యువకుడు.

ఇవీ చూడండి: గవర్నర్ నరసింహన్‌తో కేసీఆర్ భేటీ..

sample description
Last Updated : Sep 2, 2019, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.