ETV Bharat / state

విద్యా విధానంలో మార్పులు అవసరం: డీఆర్డీఓ ఛైర్మన్ సతీష్‌రెడ్డి

author img

By

Published : Sep 3, 2020, 6:55 AM IST

వరంగల్ నిట్‌లో నిర్వహించిన జాతీయ వెబ్‌నార్​లో డీఆర్డీఓ ఛైర్మన్ సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులను బహుముఖ విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేలా నూతన విద్యావిధానం ఉండాలని పేర్కొన్నారు.

DRDO Chairman Satish Reddy participated in a national webinar organized by warangal nit
నూతన విద్యావిధానం ఉండాలి: డీఆర్డీఓ ఛైర్మన్ సతీష్‌రెడ్డి

విద్యార్థులను బహుముఖ విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేలా నూతన విద్యావిధానం ఉండాలని డీఆర్డీఓ ఛైర్మన్ సతీష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేలా విద్యార్థులు తయారవ్వాలని చెప్పారు.

డీఆర్‌డీవో సైతం ప్రతిభ గల ఎందరో పరిశోధకులకు అవకాశం కల్పిస్తోందని చెప్పారు. సాంకేతిక విద్యలో జాతీయ విద్యావిధానం అమలుపై వరంగల్ నిట్‌లో జరిగిన జాతీయ వెబ్‌నార్‌లో ఆయన పాల్గొన్నారు. సాంకేతిక విద్య ఎన్నో సవాళ్లను చవిచూస్తోందని.... కొత్త విద్యావిధానం వాటికి పరిష్కార మార్గాలు చూపాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: ఐరాస సమావేశంలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.