వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేటలో 70 లక్షల రూపాయల విలువైన వివిధ రకాల వ్యవసాయ ఉపకరణ యంత్రాలను అక్షయ మహిళా రైతు ఉత్పత్తి సమాఖ్య సంఘాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హరిత పాల్గొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే కృషితోనే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నియోజక వర్గంలో చేపడుతున్నారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు ఆ దిశగా వారిని చైతన్య పరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
మహిళా సమాఖ్య సంఘాలు వృద్ధి సాధించేందుకు వారికి సబ్సిడీలు అందించి ముఖ్యంగా.. కుటీర పరిశ్రమల స్థాపన ద్వారా ఆహారోత్పత్తుల తయారీ మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తద్వారా మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ఎదగాలనే కారణంతోనే అనేక పథకాలను ప్రవేశపెడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి : బండి సంజయ్ అధ్యక్షతన భాజపా పదాధికారుల సమావేశం