వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రబీ సీజన్లోని ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రారంభించినట్లు తెలిపారు. 80 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ, సివిల్ సప్లై అధికారులు, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈవీఎంల కలకలం