Chennai International Film Festival : కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సందడి చేశారు. ఇందులో భాగంగా అమరన్ చిత్రానికి ఉత్తమ నటిగా సాయిపల్లవి, మహారాజ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి పురస్కారాలను అందుకున్నారు.
ఈ పురస్కారం అందుకోవడంపై హీరోయిన్ సాయి పల్లవి ఆనందం వ్యక్తం చేసింది. "22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు అందుకున్నందుకు నాకెంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఎందుకంటే, ఈ ఏడాది ఎన్నో గొప్ప సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఎంతో పోటీ కూడా నెలకొంది. అలాంటి టైమ్‌లో ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. నా ఫ్యాన్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. వారు చూపించే ప్రేమ నన్నెంతో ఎమోషనల్‌కు గురి చేస్తుంటుంది. ముకుంద్ కుటుం బసభ్యులు, ఆయన భార్య వల్లే ఇది సాధ్యమైంది. ఈ కథను ప్రపంచానికి చెప్పడానికి వాళ్లు ఓకే చెప్పడం వల్లనే దీనిని తెరకెక్కించగలిగాం. దేశం కోసం నిరంతరం శ్రమిస్తోన్న ఒక జవాను కథ ఇది. రాజ్‌కుమార్ పెరియాసామి లాంటి డైరెక్టర్సే ఇలాంటి మరెన్నో కథలను మనకు అందించగలరు" అని సాయి పల్లవి పేర్కొన్నారు.
ఇక తాను అవార్డు అందుకోవడంపై విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా ఆనందం వ్యక్తం చేశారు. మహారాజను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు
విజేతలు లిస్ట్ ఇదే
ఉత్తమ చిత్రం : అమరన్
రెండో ఉత్తమ చిత్రం : లబ్బర్ పందు
ఉత్తమ నటుడు : విజయ్ సేతుపతి (మహారాజ)
ఉత్తమ నటి : సాయిపల్లవి (అమరన్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సీహెచ్ సాయి (అమరన్)
ఉత్తమ ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్ (అమరన్)
ఉత్తమ బాలనటుడు : పొన్వెల్ (వాళై)
ఉత్తమ సహాయనటుడు: దినేశ్ (లబ్బర్ పందు)
ఉత్తమ సహాయనటి : దుషారా విజయన్ (వేట్టయన్)
ఉత్తమ రచయిత : నిథిలన్ సామినాథన్ (మహారాజ)
ఉత్తమ సంగీత దర్శకుడు : జీవీ ప్రకాశ్ (అమరన్)
స్పెషల్ జ్యూరీ అవార్డు : మారి సెల్వరాజ్ (వాళై), పా.రంజిత్ (తంగలాన్)
రా అండ్ రస్టిక్ లుక్‌లో అల్లరి నరేశ్ - 'బచ్చల మల్లి' ఎలా ఉందంటే?
ఒకే స్టేజీపై ఐశ్వర్య కుమార్తె, షారుక్ తనయుడి సందడి - పిల్లల పెర్ఫామెన్స్ చూసి మురిసిపోయిన స్టార్స్!