వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం పాకాల ఆయకట్టు సంగెం పంట కాలువ వరి పొలాల్లో రైతులకు మొసలి కనిపించింది. వర్షాకాలంలో పాకాల సరస్సు నీటి ప్రవాహ ఉద్ధృతికి బయటకు వచ్చి పంట పొలాలకు చేరినట్లు సమాచారం. ప్రస్తుతం వరి పంటలు కోత దశకు రావడంతో పొలాల్లో నీరు లేకపోవడంతో అవి బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రైతులకు పొలాల్లో మొసలి కనిపించింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు రైతులు తెలిపారు. అధికారులు అక్కడికి చేరుకొని మొసలిని స్వాధీనం చేసుకొని పాకాల సరస్సులో వదలనున్నారు.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా