వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లోని నందీశ్వర, వెంకటేశ్వర గోశాలల ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా గోవులు పంపిణీ చేశారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గత కొన్నేళ్లుగా ఉచితంగా ఆవులను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అన్నదాతలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆవుల పెంపకం వల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల మెరుగైన ప్రయోజనాలు ఉంటాయని తెలంగాణ గోశాల ఫెడరేషన్ అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ అన్నారు.
ఇవీ చూడండి: భానుడి భగభగలకు తగలబడిన బైక్