పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పలు పట్టణాలు, వార్డుల్లో పార్టీలు ప్రచారం చేపట్టాయి. పరకాల పట్టణంలోని 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ధర్నా వేణుగోపాల్ తరఫున యూత్ కాంగ్రెస్ వరంగల్ గ్రామీణ జిల్లా అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం చేశారు.
అన్యాయాన్ని గుర్తించాలి..
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ముందు హామీలిచ్చి ఆ తర్వాత వాటిని గాలికొదిలేసిన ఘనత తెరాసకే దక్కుతుందని విమర్శించారు. 9వ వార్డులో తెరాస చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. వార్డు సమస్యలను ఎన్నిసార్లు తెరాస కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. నిరుద్యోగులు, విద్యార్థులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని గుర్తించి కాంగ్రెస్ అభ్యర్థి వేణుగోపాల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు తేలికపాటి వర్షాలు