వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో భాజపా శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. బండి సంజయ్‌పై జరిగిన పోలీసుల దాడిని ఖండిస్తూ జిల్లా భాజపా నేతలు వర్ధన్నపేటలోని ఖమ్మం - వరంగల్ జాతీయ రహదారిపై ఆందోళకు దిగారు. ఫలితంగా ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టి అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు భాజపా నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి... తోపులాటకు దారితీసింది. నిరసనకారులు దిష్టి బొమ్మను దహనం చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఇదీ చదవండి: సిద్దిపేట ఉద్రిక్తతల నేపథ్యంలో బండి సంజయ్ దీక్ష