ETV Bharat / state

బావిలో లభ్యమైన మృతదేహాలకు శవపరీక్ష పూర్తి - గొర్రెకుంట బావిలో లభ్యమైన మృతదేహాలకు శవపరీక్ష పూర్తి

autopsy
గొర్రెకుంట బావిలో లభ్యమైన మృతదేహాలకు శవపరీక్ష పూర్తి
author img

By

Published : May 23, 2020, 10:39 AM IST

Updated : May 23, 2020, 11:52 AM IST

10:27 May 23

బావిలో లభ్యమైన మృతదేహాలకు శవపరీక్ష పూర్తి

         వరంగల్‌ జిల్లా గొర్రెకుంట శివారు గన్నీసంచుల గోదాంలోని పాడుబడ్డ బావిలో లభించిన 9 మృతదేహాలకు శవపరీక్ష పూర్తైంది. షకీల్‌ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు అక్కడకు వచ్చారు. వరంగల్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ మృతదేహాలకు సంబంధించి శవపరీక్ష నివేదిక వస్తేనే మృతికి సంబంధించి పూర్తి కారణాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

         చనిపోయిన వారిలో ఆరుగురు ఒకే కుటుంబ సభ్యులు.. మిగతా ముగ్గురు ఆ కుటుంబానికి సన్నిహితులు. బుధవారం రాత్రి మక్సూద్‌ కుటుంబ సభ్యులు.. పుట్టిన రోజు వేడుక చేసుకున్నారు. ప్రత్యేక వంటకాలతో అందరూ కలిసి భోజనం చేశారు. ఈ సమయంలోనే విషప్రయోగం చేసి.. అపస్మారక స్థితిలో ఉన్నవారిని బావిలో పడేశారా...? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

       మృతుల ఆధార్‌కార్డులు, వారి సెల్‌ఫోన్ నంబర్లను అధికారులు సేకరించారు. మృతి చెందిన వ్యక్తులందరి సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్​ అయ్యాయి. కేసుకు సంబంధించి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు.. కారణాలు తెలుసుకునేందుకు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : May 23, 2020, 11:52 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.