కళాశాలల బంద్ - COLLEGES BOY COT IN WARANGAL
నిన్న వరంగల్‌లో ప్రేమోన్మాది దాడికి గురైన బాధితురాలికి విద్యార్థి సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఇవాళ వారి ఆధ్వర్యంలో కళాశాలల్లో తరగతులను బహిష్కరించారు.
కళాశాలల బంద్
వరంగల్‌లో ప్రేమోన్మాది దాడికి గురైన బాధితురాలికి సంఘీభావం ప్రకటిస్తూ.. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలు కళాశాలల్లో తరగతులను బహిష్కరించారు. వాగ్దేవి కాలేజీలో ఇంటర్నల్ పరీక్షలను వాయిదా వేశారు. ఇది అమానవీయ చర్యగా ప్రిన్సిపల్ అభివర్ణించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్ డిమాండ్ చేశారు. ముందు జాగ్రత్తగా నగరంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.