వరంగల్ గ్రామీణ జిల్లా పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు వేదికల నిర్మాణం, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, విలేజ్ పార్కు నిర్మాణాలను కలెక్టర్ హరిత పరిశీలించారు. జిల్లాలోని పర్వతగిరి, సంగేమ్ మండలాల్లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రైతు వేదికల నిర్మాణంలో అలసత్వం వహిస్తే సహించేదిలేదని కలెక్టర్ హెచ్చరించారు. పర్వతగిరి మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన జరగడం పట్ల సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో అలసత్వం వహిస్తే సస్పెండ్ చేస్తామని హరిత తెలిపారు.
ఇదీ చదవండిః రాంపూర్ శివారులో మంత్రి హరీశ్ రావు వాహనం తనిఖీ