ETV Bharat / state

లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ - లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో ఎనిమిది మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. రూ. 1,18,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో అందజేశారు.

cm relief fund cheque given by mla challa dharmareddy
లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మల్యే చల్లా
author img

By

Published : Sep 10, 2020, 7:22 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూర్​, దామెర, గీసుకొండ మండలాల్లోని పలువురు వ్యాధి బారిన పడి చికిత్స చేయించుకున్న వారికి స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 8 మంది లబ్ధిదారులకు నిధులను అందజేసినట్లు ఎమ్మెల్యే వివరించారు.

గురువారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో లబ్ధిదారులకు రూ. 1,18,500 విలువైన చెక్కులను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తోందన్నారు. తెల్ల రేషన్​ కార్డు కలిగి ఉన్ ప్రతి ఒక్కరు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనని ఎమ్మెల్యే వివరించారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అందని ఇళ్లు లేదని.. ఏదో విధంగా ప్రజలందరూ ప్రభుత్వం తరపున లబ్ధి పొందుతున్నారన్నారు.

ఇవీ చూడండి: ఎంత మందికి కరోనా సోకినా చికిత్స అందించడానికి సిద్ధం: మంత్రి ఈటల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.