వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఈ నెల 4న అనారోగ్యంతో ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి కన్నుమూయగా... ఈరోజు శాయంపేట మండలం ప్రగతిసింగారంలో నిర్వహించిన దశదినకర్మకు సీఎం హాజరయ్యారు. మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కలెక్టర్ హరిత, నగర పోలీసు కమిషనర్ రవీందర్ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఎంపీలు సంతోష్ కుమార్, బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులతో భేటీ అయిన సీఎం జిల్లా అభివృద్ధిపై చర్చించారు. కాళేశ్వరం ఫలితాలు త్వరలోనే అందుతాయని, సాగునీటి కష్టాలు తప్పుతాయని వివరించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేందుకు కృషి చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: సోనియా ఎన్నిక పట్ల టీ-కాంగ్రెస్ శ్రేణుల హర్షం