ETV Bharat / state

రైతులను మోసం చేసేందుకే కొత్త చట్టాలు : ఎర్రబెల్లి

author img

By

Published : Dec 8, 2020, 3:28 PM IST

రైతుల ధర్నాకు మద్దతుగా నిర్వహిస్తున్న భారత్ బంద్​లో రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పాల్గొన్నారు. భాజపా ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ ఖమ్మం-వరంగల్​ రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు.

central govt new agriculture acts  to deceive farmers in the country says minister Errabelli
రైతులను మోసం చేసేందుకే కొత్త చట్టాలు : ఎర్రబెల్లి

కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే దిల్లీ వరకు వెళ్లి నిరసన తెలియజేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు హెచ్చరించారు. భారత్ బంద్​కు మద్దతుగా వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ ఖమ్మం-వరంగల్​ రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు.

కార్పొరేట్లకు మేలు చేసి, రైతులను మోసం చేసేందుకే భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సీఎం కేసీఆర్​ రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధుతో పాటు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. రైతన్నలకు న్యాయం జరిగేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.