వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం అక్కల్చెడ గ్రామంలో ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి జిడ్డు జాన్ అనే రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. జిడ్డు భవాని, శ్రీనుల కుమారుడు జాన్ ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి బయటకు తీసే సమయానికే జాన్ మృతి చెందాడు. అల్లారుముద్దుగా తమ ముందు ఆడుకునే కుమారుడు మృతి చెందడం వల్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవీ చూడండి: రైస్ మిల్లులో వ్యక్తి అనుమానాస్పద మృతి