ETV Bharat / sports

ఆ ఆల్‌టైమ్‌ రికార్డుపై అశ్విన్ ఫుల్ ఫోకస్!

మూడో టెస్ట్​పై అశ్విన్ ఫుల్​ ఫోకస్​ - ఆ భారీ రికార్డుపై కన్ను!

Ravichandran Ashwin IND Vs NZ Test Series
Ravichandran Ashwin (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 1, 2024, 6:51 AM IST

R Ashwin IND Vs NZ Test Series : న్యూజిలాండ్​తో శుక్రవారం ప్రారంభంకానున్న మూడో టెస్టు మ్యాచ్​ వేదికగా టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ టోర్నీలో అతడు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన భారతీయ ఆటగాడిగా రికార్డుకెక్కుతాడు. ఇప్పటివరకు టీమ్ఇండియా తరఫున అనిల్ కుంబ్లే, అశ్విన్ చెరో 37సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టారు.

ఈ నేపథ్యంలో అశ్విన్‌ టెస్టుల్లో 37 సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకోగా, మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే 35 సార్లు, వన్డేల్లో రెండుసార్లు ఐదేసి వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎనిమిదిసార్లు ఈ 10 వికెట్ల ఫీట్ సాధించారు. అది కూడా టెస్టుల్లోనే కావడం విశేషం.

ఇక కివీస్‌తో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో అశ్విన్ ఆరు వికెట్లను పడగొట్టాడు. అయితే ఈ మూడో టెస్టులో అశ్విన్ తన మార్క్ చూపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ పిచ్‌ స్పిన్నర్లకు సహకరిస్తుందని క్రికెట్ వర్గాల మాట.

అయితే ఈ వేదికగా భారత్, న్యూజిలాండ్ చివరగా 2021 డిసెంబరులో టెస్టు మ్యాచ్‌లో పోటీపడగా, అప్పుడు స్పిన్నర్లు కీలకపాత్ర పోషించారు. అప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 325 పరుగులకు ఆలౌటైంది. మొత్తం పది వికెట్లు స్పిన్నర్ అజాజ్ పటేల్‌కే దక్కాయి.
ఆ తర్వాత అశ్విన్ (4/8), సిరాజ్ (3/19), అక్షర్ పటేల్ (2/14) ధాటికి కివీస్ 62 పరుగులకే నేలకూలింది. రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 276/7 వద్ద డిక్లేర్ చేసింది. అజాజ్ పటేల్ 4, రచిన్ రవీంద్ర 3 వికెట్లు పడగొట్టారు. మరోవైపు 540 పరుగుల భారీ స్కోర్​తో బరిలోకి దిగిన కివీస్ 167 రన్స్‌కే ఆలౌటైంది. భారత స్పిన్నర్లు అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు దక్కించుకున్నారు. దీంతో భారత్ 372 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి రికార్డుకెక్కింది.

మా బ్రదర్​ విషయంలో అలా చేయడం సరికాదు!: వాషింగ్టన్ సుందర్ సోదరి

కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్ - తొలి భారత బౌలర్​గా ఘనత - Ashwin Records

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.