ETV Bharat / offbeat

సూపర్​ స్నాక్​ రెసిపీ "కోడిగుడ్డు కజ్జికాయలు" - ఈ పద్ధతిలో చేస్తే ఒక్కటీ మిగలదు!

-కోడిగుడ్లతో సూపర్​ రెసిపీ -పిల్లల నుంచి పెద్దల వరకు పోటీ పడి మరీ తింటారు

Egg Kajjikayalu at Home
How to Make Egg Kajjikayalu at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

How to Make Egg Kajjikayalu at Home: కజ్జికాయలు.. స్వీట్​ ఐటమ్స్​లో చాలా మందికి ఫేవరెట్​ ఇది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్​గా ఉండి తినేకొద్ది తినాలనిపిస్తుంది. ఇక పిల్లలైతే మరీ మరీ తింటుంటారు. అందుకే చాలా మంది మహిళలు.. పెద్ద పండగలు వస్తున్నాయంటే చాలు వీటిని ప్రిపేర్​ చేస్తుంటారు. అయితే కజ్జికాయలు అంటే కొబ్బరితో తయారు చేసినవే చాలా మందికి తెలుసు. కానీ అవే కజ్జికాయలు కాస్తా కారంగా ఉంటే.. అదీ కోడిగుడ్డుతో చేస్తే.. ఏంటి కోడిగుడ్డుతో కజ్జికాయాలా అని నోరెళ్లబెట్టబాకండి. కోడిగుడ్డుతో కూడా సూపర్​ టేస్టీగా, స్పైసీగా ఉండే కజ్జికాయలను ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఈవెనింగ్​ స్నాక్స్​ కోసం ఇవి చాలా బెస్ట్​ ఆప్షన్​. మరి, లేట్​ చేయకుండా వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • గోధుమ పిండి - 1 కప్పు
  • బొంబాయి రవ్వ - పావు కప్పు
  • ఉప్పు - పావు టీ స్పూన్
  • వేడి నూనె - 2 టీ స్పూన్లు

మిక్సింగ్​ కోసం:​

  • ఉప్పు - అర టీ స్పూన్​
  • పసుపు - పావు టీ స్పూన్​
  • కారం - 1 టీ స్పూన్​
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్​
  • గరం మసాలా - అర టీ స్పూన్​
  • వాటర్​ - 2 టీ స్పూన్లు
  • కోడిగుడ్లు - 3
  • ఉల్లిపాయ - 1
  • సన్నగా తరిగిన క్యారెట్​ ముక్కలు - 2 టేబుల్​ స్పూన్లు
  • క్యాప్సికం ముక్కలు - 2 టేబుల్​ స్పూన్లు(ఆప్షనల్​)
  • పచ్చిమిర్చి - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ విధానం:

  • ముందుగా ఓ బౌల్​లోకి గోధుమపిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, వేడి నూనె పోసి బాగా కలపాలి.
  • ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత మూత పెట్టి ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మరో గిన్నెలోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, వాటర్​ పోసి పేస్ట్​లాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి ఉల్లిపాయ తరుగు, క్యారెట్​ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి బాగా బీట్​ చేసుకోవాలి.
  • 10 నిమిషాల తర్వాత గోధుమ పిండి ముద్దను మరోసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • ఆ తర్వాత కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ పూరీలుగా వత్తుకోవాలి.
  • అనంతరం ఆ పూరీ అంచుల వెంట నీళ్లు రాసుకోవాలి.
  • ఇప్పుడు కజ్జికాయలు చేసే మౌల్డ్​ తీసుకుని అందులో కొద్దిగా పొడి పిండి చల్లి.. ప్రిపేర్​ చేసుకున్న పూరీ పెట్టి.. అందులో కొద్దిగా కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకుని మౌల్డ్​ క్లోజ్​ చేసి గట్టిగా ప్రెస్​ చేయాలి. ఆ తర్వాత మిగిలిన పిండి తీసేసి మౌల్డ్​ ఓపెన్​ చేసి కజ్జికాయలను ప్లేట్​లో పెట్టుకోవాలి. ఇలా మిగిలిన కజ్జికాయలను కూడా అలానే చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఒకవేళ మీ దగ్గర కజ్జికాయలు చేసేది లేకపోతే పూరీల అంచులకు తడి అద్ది పూరీ మధ్యలో కోడిగుడ్డు మిశ్రమం పెట్టి వెంటనే క్లోజ్​ చేసి ఫోర్క్​ స్పూన్​తో అంచులు క్లోజ్​ చేయాలి. ఇలా అన్నింటిని చేసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్​ హీట్​ అయిన తర్వాత ప్రిపేర్​ చేసుకున్న కజ్జికాయలను నిదానంగా వేసుకుని కాల్చుకోవాలి.
  • స్టవ్​ను మీడియంలో పెట్టి రెండు వైపులా లైట్​ గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేంతవరకు వేయించుకుని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని ఫ్రై చేసుకోవాలి.
  • అంతే ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉండే కోడిగుడ్డు కజ్జికాయలు రెడీ. దీన్ని వేడివేడిగా టమాట సాస్​తో తింటే అద్దిరిపోవాల్సిందే.
  • నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు.

"గుంట పొంగనాలు + పచ్చిమిర్చి పచ్చడి" డెడ్లీ కాంబినేషన్ - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా - టేస్ట్ అద్దిరిపోతుంది!

కరకరలాడే "ఎగ్ కట్​లెట్స్" - నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ వేరే లెవల్​ అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.