ETV Bharat / state

'మునుగోడులో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు తెరాస సిద్ధమైంది' - మునుగోడు ప్రచారంలో భాజపా

Bandi Sanjay on Munugode Bypoll: మునుగోడులో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు తెరాస సిద్ధమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హనుమకొండలోని ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల నరసయ్య సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో భాజపా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Bandi Sanjay
Bandi Sanjay
author img

By

Published : Oct 7, 2022, 5:22 PM IST

మునుగోడులో ఓటుకు నలభై వేలు పంచేందుకు తెరాస సిద్ధం"

Bandi Sanjay on Munugode Bypoll: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు తెరాస సిద్ధమైందని ఆరోపించారు. అధికారం అడ్డుతో కేసీఆర్‌ పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హనుమకొండలోని అభిరామ్ గార్డెన్​లో జరిగిన ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల నరసయ్య సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన.. గుజ్జల నరసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు తెరాస, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా భాజపా భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాగి తందనాలు ఆడటానికే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.

"మునుగోడులో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు తెరాస సిద్ధమైంది. అధికారం అడ్డం పెట్టుకొని కేసీఆర్‌ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. కాంగ్రెస్‌, తెరాస ఒక్కటే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. మునుగోడులో ముందే వారికి అనుకూలంగా ఉన్న అధికారులను బదిలీలు చేసుకున్నారు. తాగి తందనాలు ఆడటానికే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో భాజపా భారీ మెజార్టీతో గెలుస్తుంది".- బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.