వరంగల్ గ్రామీణ జిల్లా అధికారులు ఈ నెల 25న ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారానికి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని నర్సరీలో మొక్కలను ఏపీడీ వసుమతి పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేయడానికి సరిపడా మొక్కలున్నాయా అని నర్సరీ నిర్వాహకులను ఆరా తీశారు. నర్సరీలోని ప్రతి మొక్కను నాటేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హరితహారంలో అత్యధిక మొక్కలు నాటి, వాటిని సంరక్షించి రాష్ట్రంలో వరంగల్ గ్రామీణ జిల్లాను ఆదర్శంగా నిలపాలని తెలిపారు.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్