ETV Bharat / state

రైతులను ఆదుకుంటున్న ఏకైక సీఎం.. కేసీఆరే: చల్లా ధర్మారెడ్డి - ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

దేశంలో రైతులను ఆదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆరేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలంలోని విలీన గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్ పాల్గొన్నారు.

anointing to CM KCR photo in warangal rural district
రైతులను ఆదుకుంటున్న ఏకైక సీఎం.. కేసీఆరే: చల్లా ధర్మారెడ్డి
author img

By

Published : Nov 1, 2020, 4:30 PM IST

వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలంలోని విలీన గ్రామాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ​రైతులను ఆదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆరేనని చల్లా ధర్మారెడ్డి అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల బావుల వద్ద మీటర్లు పెడతామని చెబుతుందని చెప్పారు.

వరంగల్ మహానగర పాలక సంస్థలో విలీనమైన ధర్మారం, మొగిలిచర్ల, బొల్లికుంట గ్రామాల్లో రైతులకు సాదా బైనామాల ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణ అమలు చేస్తున్నారని చెప్పారు.

ఇదీ చదవండి: కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : లక్ష్మణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.