ETV Bharat / state

Palle pragathi: పనుల్లో వేగం.. గ్రామాల్లో అధికారుల వరుస పర్యటనలు - palle pragathi works in warangal rural district

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనులను సీఎం కేసీఆర్​ నేరుగా పర్యవేక్షిస్తానని చెప్పడంతో ఆయా జిల్లాల్లో అధికారులు అభివృద్ధి పనులను ముమ్మరం చేశారు. అధికారులు పర్యటిస్తూ పనుల తీరును పరిశీలిస్తున్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లాలో పచ్చదనం, పారిశుద్ధ్య పనులపై జిల్లా వ్యవసాయ అధికారి ఆరా తీశారు.

palle pragathi, cm kcr
పల్లె ప్రగతి, సీఎం కేసీఆర్​
author img

By

Published : Jun 19, 2021, 7:39 PM IST

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లా పర్యటన దృష్ట్యా వరంగల్ గ్రామీణ జిల్లాలో పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపునకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. వరుస పర్యటనలు చేస్తూ పనుల్లో వేగం పెంచుతున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పరిశీలిస్తూ పలు సూచనలు చేస్తున్నారు.

వర్ధన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాల్.. పారిశుద్ధ్యం, పచ్చదనం పనులను పరిశీలించారు. గ్రామాల్లో జరుగుతున్న పనులపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: NAMA: కేసీఆర్ నా బలం.. ఖమ్మం నియోజకవర్గ ప్రజలు నా బలగం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.