Warangal Baahubali: ఓ యువకుడు 50 కేజీలున్న మూడు యూరియా బస్తాలను తలపై ఎత్తికొని అవలిలాగా పొలం గట్లుపై నడిచి పోతున్న వీడియో ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయిని పహాడ్ గ్రామ శివారు చంద్రు తండా కు చెందిన నారావత్ అనిల్ తన పొలానికి ఇలా యూరియా బస్తాలు తీసుకొని పోతున్నారు.
ఆ యువకుడిని ఈటీవీ భారత్ పలకరించగా... ఇలా బస్తాలు మోసుక పోవడం తనకు అలవాటేనని, ఇంటి వద్ద సొంతంగా తయారు చేసుకున్న పరికరాలతో నిత్యం వ్యాయామం చేస్తాననని తెలిపాడు. బాక్సర్ కావాలనేది తన ఆశయమని చెప్పాడు. వీడియోని వీక్షించిన నెట్జన్లు అనిల్ చెన్నారావు వరంగల్ 'బాహుబలి' అని పిలుస్తుంటే.. మరికొందరు పొలం గట్లుపై తడబడితే పరిస్థితి ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: