వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో 18 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని స్థానిక పోచమ్మ గుడి వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా... ఆటోలో తరలిస్తున్న గంజాయిని గుర్తించినట్లు పరకాల ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. దాని విలువ దాదాపు లక్ష రూపాయలకు పైనే ఉంటుందని పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, వారితో పాటు మరొక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి అమాయకపు యువతకు వ్యసనంగా మారుస్తున్నారని ఏసీపీ తెలిపారు. దాని ప్రభావం వారిపై వితరీతంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి సారిగా పరకాలలో గంజాయి పట్టుకున్నామని, దీన్ని అరికట్టేందుకు ప్రజలంతా తమకు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో రైతుల ర్యాలీకి హైకోర్టు అనుమతి