ETV Bharat / state

పాము కాటుకు గురై మహిళ మృతి - శేరుపల్లి గ్రామంలో మహిళ మృతి

పాము కాటుకు గురై ఓ మహిళా రైతు మృతి చెందారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం శేరుపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

Woman died after snake bite
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం శేరుపల్లి గ్రామంలో పాముకాటుతో మహిళ మృతి
author img

By

Published : May 1, 2021, 10:35 AM IST

పొలం పనులు చేసేందుకు వెళ్లిన ఓ మహిళా రైతు పాముకాటుకు గురై మరణించింది. ఈ ఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం శేరుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది

గ్రామానికి చెందిన శాంతమ్మ (45) పొలం పనులు చేస్తున్న క్రమంలో శుక్రవారం సాయంత్రం పాముకాటుకు గురైయింది. వెంటనే అప్రమత్తమైన ఆమె ఇంటి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది. తనకు పాము కరిచిందని కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే ఆమెను వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. మృతురాలికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. శాంతమ్మ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి: కబ్జాల పేరిట నాపై వస్తున్న ఆరోపణలన్నీ కట్టుకథలు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.