నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎంపీపీలు, ఎంపీటీసీలు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించి పారదర్శక పాలనను అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఎంపీపీల ప్రమాణస్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టగానే సరిపోదని గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సభ్యులకు పూలమాలలు, శాలువాలతో సన్మానం చేశారు. అనంతరం మండల పరిధిలోని కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: ఒప్పంద కార్మికులను క్రమబద్ధికరించాలి