రహదారులు భవనాలశాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో చేపట్టిన పనులను త్వరతగతిన పూర్తి చేయాలని కలెక్టర్ షేక్ యాస్మీన్ బాషా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై ఆమె సమీక్షించారు. చిట్యాల, గోపాల్పేట, పానగల్ రహదారుల విస్తరణ పనులకు సంబంధించి కూల్చివేత పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇళ్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
అనంతరం చిట్యాల రహదారిలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును పరిశీలించారు. అప్పాయిపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రెండు గదుల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తాసీల్దార్ రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.