పెండింగ్ మిషన్ భగీరథ పనుల పూర్తిపై ఇంజినీరింగ్ అధికారులు దృష్టి సారించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ పనులపై ఆమె సమీక్షించారు. పెండింగ్ ఓహెచ్ఎస్ఆర్లపై నివేదిక ఇవ్వాలని, గ్రామాల్లో పూర్తయిన, పూర్తి కాని పనుల జాబితాను రోడ్ మ్యాప్‌తో ఇవ్వాలని తెలిపారు.
ప్రతి వారం ఏం పని చేస్తున్నారు, ఎంత వరకు పనులు పూర్తి చేస్తున్నారు అనే విషయంపై పూర్తి ప్రణాళికను అందజేయాలన్నారు. భగీరథ పనులపై నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు. ఏఈలతో పాటు డిప్యూటీ ఇంజినీర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి పనులు పర్యవేక్షించాలని యాస్మిన్ ఆదేశించారు.
ఇదీ చదవండిః హైదరాబాద్‌ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..