గత మూడు రోజులుగా వనపర్తి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నందున వనపర్తి జిల్లా తాళ్లచెరువు, నల్లచెరువు ఉప్పొంగగా.. పలు కాలనీలు నీళ్లలో మునిగాయి. ఈ మేరకు ఆయా కాలనీలను కలెక్టర్ యాస్మిన్ భాషా, ఎస్పీ అపూర్వరావు సందర్శించారు. కాలనీవాసులు ఇబ్బందిపడొద్దని.. వారందరికీ తాము అండగా ఉంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అనంతరం కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందికరంగా ఉన్న కాలనీల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలో 81.8 మి.మీ వర్షం నమోదైనట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు జిల్లాలోని అధికారులు.. ఎప్పటికప్పుడు వర్షాల వల్ల కలిగిస సమస్యలను గుర్తించి.. వెంటనే వాటిని పరిష్కరించేలా చూడాలని సూచించారు.
ఇదీ చూడండి : పచ్చదనంతో నిండిన అనంతగిరి కొండలు..