'భారీమెజార్టీతో రాములును గెలిపించండి' వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన గిరిజన అభినందన సభకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. నాగర్‌కర్నూల్ లోక్‌సభ తెరాస అభ్యర్థి రాములును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాములుకు వచ్చే మెజార్టీ... రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యతకు ఇచ్చే కానుకగా భావించాలన్నారు.
పార్లమెంట్ సభ్యునిగా అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రయోజనాలకోసం అహర్నిశలు పాటుపడతానని రాములు కోరారు.
పార్టీలకు అతీతంగా ప్రజలు ఒక్కటై తెరాస అభ్యర్థి రాములును భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.
ఇవీ చూడండి:ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ అభ్యర్థి విజయం