రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఇచ్చిన సమ్మె పిలుపు మేరకు వనపర్తిలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపో ముందు పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. కేవలం ఎనిమిది బస్సులను మాత్రమే ప్రైవేట్ సిబ్బందితో అధికారులు బయటకు పంపించారు. డిపో మేనేజర్ ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపేందుకు డ్రైవర్లను, కండక్టర్లను నియామకం చేసుకున్నారు. ఈ సమ్మె సందర్భంగా ప్రైవేటు వాహనాలతో బస్టాండ్ ఆవరణం నిండిపోయింది. సమ్మె కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈ కథనం చదవండి: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె