ETV Bharat / state

కృష్ణాతీరాన సాగునీటి పథకాల విలువైన సామగ్రి చౌర్యం

కృష్ణాతీరాన రూ. కోట్లు నిర్మించిన మినీ ఎత్తిపోతల పథకాల సామగ్రికి రక్షణ కరవైంది. పంపులు, పైపుల విభాగాల సామగ్రి తస్కరణకు గురువుతోంది. కొంత సామగ్రి తుప్పుపట్టిపోతోంది. సంబంధిత అధికారుల నుంచి కూడా రక్షణ చర్యలు లేకుండా పోయాయి.

కృష్ణాతీరాన సాగునీటి పథకాల విలువైన సామగ్రి చౌర్యం
కృష్ణాతీరాన సాగునీటి పథకాల విలువైన సామగ్రి చౌర్యం
author img

By

Published : Feb 25, 2021, 12:27 PM IST

తెలంగాణ ప్రభుత్వం భారీ, మధ్య తరహా, చిన్ననీటి పారుదల శాఖలు, ఐడీసీలను నీటి పారుదల శాఖలో విలీనం చేశారు. పూర్తిస్థాయిలో అధికారుల నియామకం లేకపోవడంతో ఎత్తిపోతల వద్ద రక్షణ చర్యలు లేకుండా పోయాయి.

రూ. 15 కోట్ల విలువైన పరికరాలు :

కొల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోని పెంట్లవెల్లి కృష్ణాతీరాన మల్లేశ్వరం, వేంకల్‌ ప్రాంతంలో ఎంగంపల్లి ఎత్తిపోతల, వేంకల్‌ ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. రూ. 3 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వీటిని నిర్మించారు. ప్రధానమైన ఇనుప పైపులు, పంపుమోటార్ల విడిభాగాలు తస్కరణకు గురవుతున్నాయి. మంచాలకట్ట తీరాన రూ. 2 కోట్లతో నిర్మించిన మాధవస్వామినగర్‌ ఎత్తిపోతల పథకానికి రక్షణ కరవైంది. ఇక్కడి విద్యుత్తు నియంత్రిక చోరీకి గురైంది. పంపుమోటార్ల విడిభాగాలు పత్తా లేకుండా పోగా ఉన్న ఇనుపపైపుల సామగ్రి తుప్పు పట్టింది. జటప్రోల్‌ తీరాన గోప్లాపూర్‌ ఎత్తిపోతల పథకంలో పంపుమోటార్ల భాగాలు తుప్పుపట్టాయి. కొంత సామగ్రి మాయమైంది. ఇక బోరబండ ఎత్తిపోతల పథకంలో ఇనుపపైపులు తుప్పుపట్టి దెబ్బతిన్నాయి. మాధవస్వామినగర్‌, గోప్లాపూర్‌ ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి రూ. 4 కోట్లు ఖర్చు పెట్టారు.

వనపర్తి జిల్లా పరిధిలోని చిన్నంబావి మండల తీరాన చెల్లెపాడు ఎత్తిపోతల పథకం విడిభాగాలు కూడా దెబ్బతిన్నాయి. గూడెం, బెక్కెం ఎత్తిపోతల పథకాల సామగ్రి తస్కరణకు గురవుతోంది, వీటి నిర్మాణంకు దాదాపుగా రూ. 6 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పటికైనా సాగునీటి శాఖ అధికారులు స్పందించి సామగ్రి పరిరక్షణకు చర్యలు చేపట్టి ఈ మినీ ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తేవాలని, వాటి పరిధి ఆయకట్టులో పంటపొలాలకు సాగునీరు అందించాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి

మినీ ఎత్తిపోతల పథకాల పరిరక్షణ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. సామగ్రిని తస్కరించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులకు సూచిస్తాను. పర్యవేక్షించే అధికారులు ఎత్తిపోతల పథకాల సామగ్రి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. - హనుమానాయక్‌, ఆర్డీవో, కొల్లాపూర్‌

ఇదీ చదవండి: 'ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే మళ్లీ ఆశ్రయించవచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.