వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ముందుగా వనపర్తి మండలంలోని పెద్దగూడెం, చిట్యాల, చిన్న గుంటపల్లి గ్రామాల్లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఖిల్లా ఘన్పూర్, సోలిపురం మండల కేంద్రాల్లో సైతం మంత్రి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మంత్రి ఐకేపీ అధికారులను ఆదేశించారు. ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు కవర్లను అందుబాటులో ఉంచాలని వారికి సూచించారు.
ఇదీ చూడండి : కాళేశ్వరం నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ