ETV Bharat / state

రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని తండావాసుల రాస్తారోకో - protest for road

వనపర్తి- గోపాల్​పేట ప్రధాన రహదారిపై వర్ష తండాకు చెందిన గిరిజనులు రాస్తారోకో నిర్వహించారు. తమ తండాకు సరైన రోడ్డుమార్గం ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ ఆందోళన చేశారు.

రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని తండావాసుల రాస్తారోకో

author img

By

Published : Sep 22, 2020, 11:07 AM IST

వనపర్తి పట్టణంలోని ఐదో వార్డుకు చెందిన వర్ష తండాకు చెందిన గిరిజనులు రాస్తారోకో చేపట్టారు. పట్టణంలోని బాల్​నగర్ వద్ద వనపర్తి- గోపాల్​పేట ప్రధాన రహదారిపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. తండాకు సరైన రోడ్డు మార్గం లేకపోవటం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. రోజంతా పని చేస్తే రూ.300 వస్తే... రాత్రిళ్లు ఏదైనా ఇబ్బంది ఉండి ఆటో కిరాయికి తీసుకొని వెళితే రూ.500 ఖర్చు చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏళ్ల తరబడి ఉన్న కాలిబాటను సైతం కొంతమంది కబ్జాచేసి... ముళ్ల కంప అడ్డు వేశారని తెలిపారు. రహదారి సక్రమంగా ఉంటే ఐదు నిమిషాల్లో వనపర్తి పట్టణానికి చేరుకునే సౌలభ్యం ఉందని గిరిజనులు పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ తండాకు సరైన రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులతో మాట్లాడి తండాకు రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వగా.... నిరసనకారులు ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి: ప్రతి ఇంటికి మిషన్​భగీరథ నీరు చేరాల్సిందే: మంత్రి నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.