ETV Bharat / state

'అక్టోబరు 10నాటికి రైతువేదికల నిర్మాణం పూర్తవ్వాలి' - వనపర్తిలో రైతువేదిక నిర్మాణాల పరిశీలన

రైతు వేదికలను అక్టోబరు 10 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు వేదికలను తనిఖీ చేశారు.

'అక్టోబరు 10నాటికి రైతువేదికల నిర్మాణం పూర్తవ్వాలి'

author img

By

Published : Sep 18, 2020, 7:00 AM IST

రైతు వేదికల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. అక్టోబరు 10 నాటికి పూర్తిచేయాలని సూచించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం, కనిమెట్ట, వనపర్తి మండలం నాగవరం, పెద్దగూడెం గ్రామాల్లో పర్యటించిన ఆయన నిర్మాణంలో ఉన్న రైతు వేదికలను తనిఖీ చేశారు. సాంకేతిక పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, కూలీలను పెంచాలని ఆయా గ్రామాల్లో అధికారులను సూచించారు.

అనంతరం జిల్లా కేంద్రంలోని ఎంవైఎస్ ఫంక్షన్ హాలులో మండలాల వారీగా రైతు వేదికల నిర్మాణాలపై సమీక్షించారు. ప్రస్తుతం రైతు వేదికల పురోగతి, సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. ప్రత్యేకించి రూఫ్ స్థాయిలో ఉన్న వాటిని ఈనెల 30 లోపు పూర్తిచేయాలని, బేస్మెంట్ పూర్తి అయిన వాటిని అక్టోబర్ 5 నాటికి పూర్తిచేయాలని, బేస్మెంట్ కన్నా కింది స్థాయిలో ఉన్న వాటిని అక్టోబర్ 10 నాటికి పూర్తి చేయాల్సిందిగా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీవాత్సవ, పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సత్యనారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: పునరావాసం కల్పించడంలో అధికారుల మీనమేషాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.