వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో తడి, పొడి చెత్త సేకరణకై ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను జిల్లా పాలనాధికారిని శ్వేతా మహంతి శనివారం పంపిణీ చేశారు. 30 రోజులు మాత్రమే కాకుండా, 365 రోజులు గ్రామాన్ని తమ ఇంటిలాగా భావించి ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ శ్వేతా మహంతి కోరారు. ప్రతి ప్రతి ఒక్కరు ఇంటి ముందు మొక్కలు నాటాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ప్రతి ఒక్కరు తమ కర్తవ్యంగా భావించి చెత్తను బయట పడేయకుండా చెత్త బుట్టలో వేయాలని కోరారు. గ్రామస్తులందరూ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాలని తెలిపారు.
ఇదీ చూడండి : స్వామివారి ఉత్సవాల్లో శునకాల పోటీలుస్వామివారి ఉత్సవాల్లో శునకాల పోటీలు