ETV Bharat / state

వనపర్తిలో 20 నుంచి ఆగస్టు 1 వరకు స్వచ్ఛంద లాక్​డౌన్​

author img

By

Published : Jul 19, 2020, 4:23 PM IST

వనపర్తిలో ఈ నెల 20 నుంచి ఆగస్టు 1 వరకు స్వచ్ఛంద లాక్​డౌన్​ పాటించనున్నట్లు వ్యాపార, వర్తక సంఘం సభ్యులు తెలిపారు. ఈ మేరకు సంఘం తరఫున తీర్మానం చేసుకున్నారు. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్​డౌన్​ను కచ్చితంగా​ అమలుపర్చాలని నిర్ణయించారు.

self lock down in wanaparthy town
వనపర్తిలో 20 నుంచి ఆగస్టు 1 వరకు వ్యక్తిగత లాక్​డౌన్​

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యాపార, వర్తక సంఘం సభ్యులు స్వచ్ఛంద లాక్​డౌన్ పాటించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 20 నుంచి ఆగస్టు 1 వరకు వ్యాపార సముదాయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సంఘం తరఫున తీర్మానం చేసుకున్నారు. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్​డౌన్​ను కచ్చితంగా​ అమలుపర్చాలని సూచించారు.

వనపర్తి పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వ్యాపార సంఘ సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్క వ్యాపారస్థుడు సంఘం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. ఇప్పటికే పట్టణంలోని అన్ని కాలనీల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయని... ఇంకా నిర్లక్ష్యం చేస్తే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం సాధ్యం కాదని ప్రజలకు వివరించారు.

ఇదీ చూడండి: బీసీజీ టీకా కరోనా నుంచి రక్షిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.