ETV Bharat / state

రికార్డు స్థాయిలో వేరుశనగ ధర... అన్నదాతల హర్షం - తెలంగాణ వార్తలు

వనపర్తి మార్కెట్​లో వేరుశనగకు గరిష్ఠ ధర నమోదైంది. మునుపెన్నడూ లేనివిధంగా క్వింటాకు రికార్డు స్థాయిలో రూ.7,942 వరకు పలికింది. అధిక ధరలపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

record-price-for-peanuts-in-wanaparthy-market
రికార్డు స్థాయిలో వేరుశనగ ధర... అన్నదాతల హర్షం
author img

By

Published : Jan 19, 2021, 1:36 PM IST

వనపర్తి మార్కెట్​లో వేరుశనగకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర నమోదైంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు వచ్చే వేరుశనగకు క్వింటాకి గతంలో రూ.3వేల నుంచి రూ.6వేల ధర పలికేది. ఈ ఏడాది గరిష్ఠంగా రూ.7,942 వరకు నమోదవుతోంది.

వనపర్తి మార్కెట్ యార్డ్ చరిత్రలోనే వేరుశనగకు అధిక ధర నమోదు కావడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగకు కేంద్ర ప్రభుత్వం రూ.5,275 మద్దతు ధర ప్రకటించినప్పటికీ... జిల్లా మార్కెట్​లో రైతులకు మద్దతు ధర కంటే దాదాపు రూ.3వేల వరకు అధిక ధర లభిస్తోంది.

జిల్లా పరిధిలో పండించిన వేరుశనగకు బహిరంగ మార్కెట్​లో ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల... ఇక్కడి వ్యాపారులు అధిక ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో పంట విస్తీర్ణం తగ్గినప్పటికీ... విక్రయంలో అధిక ధరలు రావడం వల్ల నష్టం లేదంటున్నారు వ్యవసాయాధికారులు.

ఇతర మార్కెట్లలో ధరల వివరాలు...

  • గద్వాల మార్కెట్​- క్వింటా రూ.7,285
  • సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్- క్వింటా రూ.7009
  • వరంగల్ మార్కెట్​- క్వింటా రూ.7 వేలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.