ETV Bharat / state

'గొర్రెలు తీసుకున్నరు..  పైసలు ఎప్పుడిస్తరు'

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. గొర్రెలను కొన్న అధికారులు.. పంపిణీదారులకు డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్​లోని కడప, కర్నూలు, అనంతపురంకు  చెందిన  పంపిణీదారులు.. మా సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

author img

By

Published : May 5, 2019, 1:31 PM IST

'గొర్రెలు తీసుకున్నరు..  పైసలు ఎప్పుడిస్తరు'

రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం కోసం.. వనపర్తి జిల్లాలోని పలు మండలాలతో పాటు.. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు వెళ్లి... అక్కడ కొనుగోలు చేశారు. 15 రోజుల్లో డబ్బులు మీ ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు.

అధికారులు గొర్రెలు కొనుగోలు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా... అమ్మకం దారులకు డబ్బులు పంపలేదు. ఇన్నాళ్లు వేచి చూసినా ఫలితం లేక... శనివారం వనపర్తికి చేరుకున్నారు. మొదటగా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతిని కలిసి తమకు డబ్బులు చెల్లించాలని కోరగా... మీ దగ్గర గొర్రెలు కొనుగోలు చేసిన అధికారులను తీసుకుని రావాలని కలెక్టర్ సూచించారు. వెంటనే జిల్లా పశువైద్యాధికారి అయిన హరికృష్ణను సంప్రదించారు. తాను కొత్తగా ఉద్యోగంలోకి వచ్చానని కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియదని చెప్పారు. అధికారుల తీరు పట్ల అమ్మకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు 8 కోట్ల బకాయిలు తమకు రావాల్సి ఉందని త్వరగా డబ్బు ఇప్పించాలని అధికారులను కోరారు. అర్థిక సమస్యల కారణంగానే ప్రేమగా పెంచుకున్న గొర్రెలను అమ్ముకున్నామని ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.

ఇవీ చూడండి: నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.